NTV Telugu Site icon

Weather Update : తెలంగాణకు వర్షసూచన..

వేసవికాలం భానుడి తాపానికి ప్రజలందరూ చెమటలు కక్కుతున్నారు. సూర్యోదయం నుంచే కూలర్లు, ఏసీలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే భానుడి భగభగ నుంచి కూల్‌ చేసే విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రాంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో గంటకు 30 నుండి40 కిలీమీటర్ల వేగంతో గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే కురసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Vemula Prashanth Reddy : మంచి ధాన్యంలో కిలో తరుగు తీసిన రైస్ మిల్లులు సీజ్ చేస్తాం