NTV Telugu Site icon

Telangana Weather: అలర్ట్.. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

Telangana Weather

Telangana Weather

Telangana Weather: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు రెండు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల నేడు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షం చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు రాష్ట్రం వైపుకు కింది స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ, (రేపు) ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో కృష్ణానదిపై వున్న శ్రీశైలం జలాశయానికి 2,36,513 క్యూసెక్కుల వరద వస్తున్నది.అధికారులు ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2,56,607 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇక.. ఇప్పుడు 884.30 అడుగుల వద్ద నీరు ఉన్నది.

ప్రాజెక్టులో 215.80 టీఎంసీలకు గాను 211.47 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో అధికారులు 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రాజెక్టుకు ఎగువనుంచి 2.51 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. కాగా.. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు వుంది.. ఇప్పుడు 588 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులో మొత్తం 312 టీఎంసీల నీరు నిల్వ ఉంచవచ్చని అంచనా.. ప్రస్తుతం 307 టీఎంసీల నీరు ఉంది.
Monday Special Pooja For Lord Shiva Live: శివసహస్రసామ స్తోత్ర పారాయణం చేస్తే..