NTV Telugu Site icon

Southwest Monsoon: విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. ఐదు రోజుల పాటు వర్షాలు

Telangana Wether

Telangana Wether

Southwest Monsoon: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో నేడు, రేపు (సోమ, మంగళ)వారాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక రానున్న ఐదు రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దీంతో.. రుతుపవనాలు వేగంగా విస్తరించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read also: Fake Note: టీజీగా మార్చేందుకు రూ.2,767 కోట్లు.. ఫేక్‌ నోట్‌ పై సర్కారు సీరియస్..

కాగా.. హైదరాబాద్‌లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీని 040-21111111, 9001136675 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇక ఏపీలో కూడా కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ.. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఇక తెలంగాణలో పగటిపూట 27 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుంది. ఏపీలో 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతోంది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
Rajahmundry: గోదావరిలో క్రమేపీ పెరుగుతున్న నీటిమట్టం

Show comments