Site icon NTV Telugu

రైతు సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తాం: నామ నాగేశ్వర్‌రావు

పార్లమెంట్‌ శీతకాల సమావేశాల్లో తెలంగాణ రైతుల సమస్యల గురించి పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే… రెండు సభలోని చర్చ జరగాలని ప్రతిపాదించినా కేంద్రం స్పందించడం లేదన్నారు. తప్పుడు సమాచారం ఇస్తూ తెలంగాణ రైంతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సభలో మా గొంతు నొక్కుతున్నారు. ఇది తెలంగాణ రాష్ర్ట సమస్య, రైతుల గురించి పోరాడుతున్న మాపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. లోక్‌సభ, రాజ్యాసభలో నిరసన తెలిపామన్నారు. కేంద్రం మీద బియ్యం కొనాల్సిన బాధ్యత ఉన్న ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. అయినా మేము రెండు సభలో ఈ సమస్యలను వినిపించాలని ప్రయత్నం చేస్తే మా మైక్‌లను వెంటనే కట్‌ చేస్తున్నారని నామా నాగేశ్వర్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు సమస్యను వినకుండా పరిష్కారం ఎలా చూపెడతారో చెప్పాలని నామ డిమాండ్‌ చేశారు. సభ సాంప్రదాయాలను బీజేపీ గౌరవించడం లేదన్నారు. ఆల్‌పార్టీ మీటింగ్‌లో వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఖచ్చితంగా రాజ్యాసభ, లోక్‌సభ ఏదో ఒక సభలో చర్చకు అనుమతిని ఇవ్వాలని కోరినా బీజేపీ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా సభలో ఈ అంశం చర్చకు పెట్టి పరిష్కారం తీసుకురావాలని ఆయన అన్నారు. ఎఫ్‌సీఐ ఒకలా చెబుతుంది. వ్యవసాయ శాఖ ఒకలాచెబుతుంది. నలుగురు నాలుగు విధాల చెబుతుంటే ఎవ్వరి మాట వినాలని నామా ప్రశ్నించారు.

Exit mobile version