Site icon NTV Telugu

Ponnam Prabhakar: రచ్చబండలో ఇచ్చే ప్రతి హామీ నెరవేరుస్తాం

Ponnam

Ponnam

రచ్చబండ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి హామీని 2023లో అధికారం లోకి రాగానే నెరవేరుస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నేతలు అది శ్రీనివాస్ తదితరులతో కలసి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్ర అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలకు ఇచ్చే హామీలన్నీ నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 2004 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడాలని ఆయన కోరారు.

Ranga Reddy: అమ్మాయి విషయంలో యువ‌కుల‌ మధ్య‌ ఘర్షణ.. క‌త్తితో దాడి

Exit mobile version