NTV Telugu Site icon

Harish Rao: రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు మెడిసిన్ ఎగుమతి చేస్తాం

Harish Rao

Harish Rao

Harish Rao: రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు కూడా మందులు సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుంది మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయుర్వేదిక్ వైద్యుల కృతజ్ఞత సభ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. షుగర్, బీపీ ట్యాబ్లెట్ల నుంచి బయటికి రావాలంటే మన జీవన శైలిలో మార్పులు రావాలని కోరారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పు వస్తే బీపీ, షుగర్ నయం చేయవచ్చని తెలిపారు. ఆరెళ్ల వరకు బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు వాడానని, ఆహారపు అలవాట్ల మార్పుతో ఆరు నెలల నుంచి షుగర్ లేదని, ఇంకా బీపీ ఉంది పోలేదని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో దేశంలో 11 స్థానంలో ఉండేదని అన్నారు. ఇప్పుడు 3 స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు మంత్రి. ఆయుష్ విభాగంలో అందరం కష్టపడి నంబర్ వన్ స్థానానికి వచ్చేటట్టు కృషి చేద్దామన్నారు.

Read also: KTR: తర్వలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. ఈ ప్రక్రియ అల్లం నారాయణకు అప్పగించామన్న కేటీఆర్

రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు కూడా మందులు సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందన్నారు. డాక్టర్లు పేషేంట్ల పట్ల ప్రేమ, ఆప్యాయతతో వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో అత్యధిక మరణాల్లో టాప్ టెన్ లో మన దేశం కూడా ఉండటం బాధాకరమన్నారు. ఇన్ని రోజులు పరిపాలించిన పాలకులు వైద్య రంగాన్ని పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ మోడల్ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే మరణాలు తగ్గే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రులలో 70 శాతం జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో అత్యధిక మాంసం తినేది తెలంగాణ లోనే అని అన్నారు. రాజస్థాన్ లో 32 శాతం నాన్ వెజ్ తింటే..తెలంగాణలో 99.2 శాతం మంది మాంసాహారం తింటారని వెల్లడించారు. ఉప్పు, కారం ఎక్కువగా తినేది కూడా మనమే..అందుకే మనకు కోపమెక్కువ అంటూ తన మాటలతో ప్రజలకు మంత్రి నవ్వించారు. అనంతరం అక్కడి నుంచి సిద్దిపేట రైతు బజార్‌ను సందర్శించి, క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేట పట్ల నిబద్ధతను సాక్ష్యాధారాలుగా చూశారు. ఈ శక్తివంతమైన మార్కెట్ లో రైతులతో సంభాషించారు. దాని పరిశుభ్రతను కాపాడుకోవడానికి, మన స్థానిక వ్యవసాయ సమాజానికి మద్దతు ఇవ్వడానికి కలిసి పని చేద్దామని మంత్రి అన్నారు.
Lok Sabha Election 2024: ప్రతిపక్షాల కూటమి పేరు పీడీఏ..? అన్ని పక్షాలు అంగీకరించినట్లుగా టాక్..