NTV Telugu Site icon

Four tigers in Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డుపై నాలుగు పులులు.. పరుగులెత్తిన జనం

Adilabad Tiger

Adilabad Tiger

Four tigers in Adilabad: పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు. పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఆదిలాబాద్‌జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామం, తాంసి మండలం పిప్పలకోటి గ్రామం మధ్య రోడ్డుపై కాల్వ పనులు కొనసాగుతున్న ఏరియాలో నాలుగు పులులు కనిపించాయి. తన ట్రక్కులో ఇంధనం నింపుతున్నప్పుడు పిప్పల్‌కోటి గ్రామం వద్ద రిజర్వాయర్ సమీపంలో రోడ్డుపై కనిపించిన పులులను డ్రైవర్ వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది.

4 పులులు మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి వచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. వేట కోసం పెన్‌గంగా నదిని దాటి తరచుగా ఆదిలాబాద్‌లోకి ప్రవేశిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. జంతువులను పర్యవేక్షించేందుకు యానిమల్ ట్రాకర్లను ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వారు తెలిపారు. పులుల కదలికలను ప్రత్యేక టీంలు మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పులులకు హాని చేయవద్దని అన్నారు.

నవంబర్ 8న జైనంత్ మండలం హతీఘాట్ గ్రామం, భీంపూర్ మండలంలోని రాంపూర్ గ్రామం మధ్య ఉన్న చనకా-కొరాట అంతర్ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు కాలువలో పులులు సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. కొరాట, గూడ, రాంపూర్, తాంసి, గొల్లఘాట్‌తో పాటు పలు గ్రామాల వాసులు పులి భయంతో వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు అక్టోబర్ 12న ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కొలమా గ్రామం అడవుల్లో పులి మేకను చంపింది. సెప్టెంబర్ 23న భీంపూర్ మండలం ధనోరా గ్రామంలో వ్యవసాయ పొలాల్లో కూడా పులి కనిపించింది. తాంసి, భీంపూర్ మండలాల్లోని అడవుల్లో పెద్దపులి కనిపించింది. కొన్ని వారాల పాటు TWS నుండి పులి యొక్క కదలికను గుర్తుపెట్టారు అధికారులు.
Iran: హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నందుకు తొలి మరణశిక్ష విధించిన ఇరాన్