WGL WIFE MURDER : కట్నం ఎంత ఇచ్చినా.. కొంత మంది కిరాతక భర్తలు సంతృప్తి పడడం లేదు. ఇంకా ఇంకా డబ్బులు కావాలని అని.. భార్యలను వేధిస్తూనే ఉన్నారు. వారి వేధింపులకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. అంతే కాదు అడిగినంత అదనపు కట్నం తీసుకు రాకుంటే అంతే సంగతులు. భార్య అని కూడా చూడకుండా వారిని కడతేర్చేందుకు కూడా ఏ మాత్రం సంకోచించడం లేదు. ఇలాంటి ఘటనలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాధ పురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను.. కల్లూరు మండలం ఖాన్ ఖాన్ పేటకు చెందిన నరేష్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు.
పెళ్లి సందర్భంగా 10 లక్షల నగదుతోపాటు 2 ఎకరాల మామిడి తోటను కట్నంగా ఇచ్చారు. వైభవంగా పెళ్లి చేశారు. అయినా నరేష్‌కు కట్నం దాహం తీరలేదు. కట్నంగా ఇచ్చిన భూమిని అమ్మి డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడు. దీని కోసం మూడేళ్ల నుంచి భార్యను నానా ఇబ్బందులు పెడుతున్నాడు. అంతే కాదు రెండేళ్ల నుంచి భార్యకు ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ముల నుంచి మాటల్లేకుండా చేశాడు. పైగా ఆమె వద్ద ఉన్న ఫోన్ తీసేసుకున్నాడు… వాయిస్: రెండేళ్ల నుంచి లక్ష్మీ ప్రసన్న నుంచి తల్లిదండ్రులకు ఎలాంటి కాంటాక్ట్ లేదు. కానీ సడెన్‌గా ఫోన్ చేసిన నరేష్.. లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి జారి పడిందని.. ఆస్పత్రిలో చేర్పించామని వారికి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి చూసి షాకయ్యారు. ఆమె శరీరం పీలగా తయారైంది. చాలా నీరసంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి తిండి సరిగా తినలేదని అర్ధమైంది. ఐతే ఏంటి.. ఆమె శరీరం ఇలా ఉందని నరేష్‌ను ప్రశ్నించారు. లక్ష్మీ ప్రసన్నకు థైరాయిడ్ ఉందని చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan : బడా నిర్మాత చేతికి నైజాం ‘OG’ థియేట్రికల్ రైట్స్..
మొత్తంగా ఎముకల గూడుగా తయారైన లక్ష్మీ ప్రసన్నను చూసి తల్లిదండ్రులు కంటనీరు పెట్టుకున్నారు.. మరోవైపు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రసన్న మృతి చెందింది. ఐతే తమ కూతురికి తిండి పెట్టకుండా అత్తింటి వారు చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. మరోవైపు వరంగల్‌లోనూ అదనపు కట్నం కోసం భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు ఓ భర్త. పెళ్లి జరిగిన 4 నెలల్లోనే భార్యను కడతేర్చాడు… ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు గణేష్. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మహబూబాబాద్ జిల్లా వీరారం బాల్యం తండాకు చెందిన గౌతమిని ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. పెళ్లి సమయంలో 15 లక్షల నగదు, 25 తులాల బంగారం, ఓ ప్లాటు కట్నంగా ఇచ్చారు. పెళ్లైన కొత్తలో గణేష్ బాగానే ఉన్నాడు. కానీ 2 నెలల తర్వాత అతనిలోని మూర్ఖుడు బయటకు వచ్చాడు..
అంత ఘనంగా ఇచ్చిన కట్నం సరిపోలేదు. దీంతో అదనపు కట్నం కోసం గౌతమికి వేధింపులు స్టార్ట్ చేశాడు గణేష్. రోజూ కొట్టడం, హింసించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇది కాస్తా మరీ పీక్ స్టేజికి చేరింది. అదనపు కట్నం కోసం గొడవ పెట్టుకున్న గణేష్.. గౌతమిపై దాడి చేశాడు. ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు… గౌతమి చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పాడు. వారు వచ్చి చూసి లబోదిబోమని కన్నీరు పెట్టారు. అదనపు కట్నం కోసమే చంపేసినట్లు గౌతమి తండ్రి అశోక్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు… మొత్తంగా అమ్మాయిలకు.. కట్న కానుకలు ఘనంగా ఇచ్చి.. వైభవంగా పెళ్లి చేసినా.. అల్లుల్ల గొంతెమ్మ కోరికలు.. అదనపు కట్నం ఆశలకు.. అమ్మాయిలు సమిధలుగా మారుతున్నారు. కట్నకానుకలు చూసి పెళ్లి చేసుకునే వాడు కాకుండా.. అమ్మాయిలను నిజంగా కంటికి రెప్పలా కాపాడుకునే వారికి ఇచ్చి పెళ్లి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు..
