Site icon NTV Telugu

Online Betting: వరంగల్లో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి..

Suicide

Suicide

Online Betting: వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అనే లైశెట్టి రాజు కుమార్ (26) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లైశెట్టి భాగ్యలక్ష్మి- కుమారస్వామిల మూడవ కొడుకు చెందిన రాజు కుమార్.. అయితే, డిగ్రీ పూర్తి చేసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అతడు.. ఆన్ లైన్ బెట్టింగు అలవాటు పడ్డాడు. గత వారం రోజుల నుంచి 4 లక్షల రూపాయలు కావాలని తండ్రిని రాజు కుమార్ వేధిస్తున్నాడు.

Read Also: Arogyashri: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ సేవలు..

అయితే, లైశెట్టి రాజు కుమార్ కు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన తండ్రి.. లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు మనస్థాపనతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక, తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి కన్నీరుమున్నిరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తు్న్నారు.

Exit mobile version