NTV Telugu Site icon

Warangal: భద్రకాళి చెరువు ఖాళీ చేసేందుకు సర్వం సిద్ధం.. అడ్డుకున్న మత్స్యకారులు..

Warangal

Warangal

Warangal: వరంగల్ జిల్లా ఈరోజు భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టనున్నారు. భద్రకాళి చెరువు ప్రక్షాళనలో భాగంగా చెరువులోని నీరంతా దిగువకు వదిలేసి అందులో పూడికతీత, గుర్రపుడెక్క తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. నీటిని దిగువకు వదలడం, పూడికతీత పనులపై ఇప్పటికే ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారుల సమన్వయ సమావేశమైన విషయం తెలిసిందు. ప్రస్తుతం భద్రకాళి చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పూర్తి నీటి సామర్థ్యం 150 ఎంసీఎఫ్టీ లు.. ప్రస్తుతం 100 ఎంసీఎఫ్టీ నీరు నిల్వ ఉంది. ఇక రోజుకు 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు అధికారులు.

Read also: Sarpanch Oath Ceremony: కొత్తగా ఎన్నికైన 10 వేల మంది సర్పంచ్‌లతో ప్రమాణ స్వీకారం చేయించనున్న సీఎం

దిగువన కాలనీలు ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టారు. 15 రోజులపాటు నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొండ సురేఖ ఆదేశాలు మేరకు భద్రకాళి చెరువును ఖాళీ చేయనున్నారు అధికారులు. చెరువు ఖాళీ చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. హనుమకొండ కాపు వాడ మత్తడి ద్వారా ప్రతిరోజు 300 నుండి 500 క్యూసిక్కుల నీళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు దిగువకు వదలనున్నారు. కాపు వాడ మత్తడి నుంచి అలంకార్ పెద్ద మోరీ, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ, మీదుగా నాగారం చెరువులోకి నీళ్లను వదలనున్నారు. సుమారు 15 నుండి 20 రోజుల్లో చెరువు ఖాళీ చేయనున్నారు. పూడిక తీసిన అనంతరం నీళ్లు నింపడానికి కాకతీయ కాలువ ద్వారా ప్రణాళిక సిద్ధం చేశారు.

Read also: Hardeep Singh Puri: మనం రష్యా నుంచి చమురు కొనకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది..

అయితే మరోవైపు *భద్రకాళి చెరువు పూడికతీత పనులను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే చెరువులోని నీటిని తీయాలని ఆందోళన చేపట్టారు. భద్రకాళి సొసైటీలో సుమారు 450 మంది సభ్యులు ఉన్నారు. సుమారు రెండు కోట్ల విలువచేసే చేపలు ఉన్నాయంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధి చూపించే వరకు పూడిక తీత అడ్డుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
MLA Gaddam Vinod: బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు భద్రత పెంపు.. ప్రభాత్‌ హెచ్చరిక లేఖతో అలర్ట్..

Show comments