NTV Telugu Site icon

Medico Preethi Incident: మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం.. నిందితుడిపై అట్రాసిటీ కేసు

Kmc

Kmc

Medico Preethi Incident: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిమ్స్‌ వైద్యులు ప్రకటించారు.. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్‌ విడుదల చేసిన నిమ్స్‌ వైద్యులు.. ప్రీతికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు.. బీపీ, పల్స్ రేటు నమోదు కాని పరిస్థితి ఏర్పడింది.. ప్రీతికి ఐదుగురు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని వెల్లడించారు.. ప్రీతి నిమ్స్ లో జాయిన్ అయ్యేటప్పటికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉందంటున్నారు వైద్యులు.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్‌తో ట్రీట్మెంట్ చేస్తున్నామని.. కార్డియాక్, శ్వాస కోశ సమస్యలు ఉన్నాయని.. అన్ని డిపార్ట్మెంట్‌లు.. క్లోస్ మానటరింగ్ చేస్తున్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు నిమ్స్‌ వైద్యులు.

Read Also: Rajan Kohli resigns: విప్రోకి షాకిచ్చిన కోహ్లీ.. మూడు దశాబ్దాల తర్వాత రాజీనామా..

మరోవైపు.. కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌పై క్రైమ్ నంబర్ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని వరంగల్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ తెలిపారు.. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి.. ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖ పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు.. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని స్పష్టం చేశారు.. అయితే, సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని.. అందరూ సంయవనం పాటించాలని సూచించారు అసిస్టెంట్‌ కమిషనర్‌ బోనాల కిషన్.