MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డెడ్ బాడీ మారిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరికి బదులుగా మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి (50) మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఆసుపత్రి అధికారులు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని భార్యకు అప్పగించారు.
CM Chandrababu: మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చిన సీఎం.. ఆనందానికి అవదులు లేవు అంతే..!
కుమారస్వామి భార్య, మృతదేహాన్ని తన పుట్టింటి గ్రామమైన రాయపర్తి మండలం మైలారం తీసుకెళ్లింది. అంబులెన్స్ ఊరి చివరికి చేరుకున్న తర్వాత, శవాన్ని చూడగానే ఆమె అది తన భర్తది కాదని గుర్తించింది. వెంటనే ఆమె స్పందించి మృతదేహాన్ని తిరిగి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మా భర్త మృతదేహం ఎవరు తీసుకెళ్లారు?”, “ఇప్పుడున్న మృతదేహం ఎవరిది?” అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదంతా మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
ఎంజీఎం వైద్యులు మాత్రం.. “కుటుంబ సభ్యులే మృతునిని గుర్తించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము పోస్టుమార్టం చేసి శవాన్ని అప్పగించాం” అని వివరణ ఇచ్చారు. ఈరోజు మార్చురీలో మొత్తం నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారని తెలుస్తోంది. దీనిలో డెడ్ బాడీ మారిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి నిజానిజాలు వెలుగులోకి రావాలంటే మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!
