NTV Telugu Site icon

Vikarabad: వికారాబాద్‌లో సంచలనం.. ఒకేసారి ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐ లపై వేటు..

Warangal

Warangal

Vikarabad: తెలంగాణలో పోలీసుల ప్రక్షాళన మొదలైంది. అక్రమ దాడులను దుర్వినియోగం చేస్తున్న పోలీసు అధికారులపై వేటు పడింది. మల్టీజోన్-2లోని తొమ్మిది జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలను వీఆర్‌వోలుగా కొనసాగిస్తూ మల్టీజోన్-2 ఐజీపీ వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో పెట్టినవారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్‌ఐలుగా ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఐజీ తెలిపారు. త్వరలో వారిని లూప్‌లైన్‌కు బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఒక సీఐ, 14 మంది ఎస్సైలు బదిలీ అయిన సంగతి తెలిసిందే.

Read also: Release Clash : 2025 సంక్రాంతికి బలయ్య – చిరు వార్ తప్పేలా లేదు..

ఇసుక అక్రమ రవాణా..

ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి గండి పడుతుంది. అదేవిధంగా వాగులు, నదీ ప్రాంతాల్లో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. అదేవిధంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ సీరియస్‌గా ఉన్నారని ఐజీ తెలిపారు. ఇప్పటికే నేరస్తులతో పనిచేసిన ఆదివాదేవిపల్లి, వేములపల్లి, నారత్‌పల్లి, చండూరు, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్‌పేట, తండు ఆర్‌, చిన్నంబావి ఎస్సైలను ఐజీ బదిలీ చేశారు.

Read also: Swag Twitter Review : స్వాగ్ ట్విట్టర్ రివ్వూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టేశాడట

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా..

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఐజీ హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని తెలిపారు. స్థానికంగానే కాకుండా అంతర్రాష్ట్రానికి కూడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్రధాన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలను ఐజీ సత్యనారాయణ ఆదేశించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా, జూదం, మట్కాను పూర్తిగా నిషేధించాలి. పేకాట, మట్కా ఆడితే సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వికారాబాద్ మర్పల్లిలోని ఓ గెస్ట్ హౌస్ లో పేకాట నడుపుతున్న ప్రభాకర్ సాఠే, రఫిక్ లకు ఐజీ సత్యనారాయణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రఫీపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు.

Read also: CM Chandrababu: నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు

మైనర్ బాలికపై లైంగికదాడి కేసు..

ఇదిలావుంటే… బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఈ క్రమంలో వికారాబాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ పై వేటు వేశారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో విచారణలో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడిన జోగిపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ.నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది.
Official : భగవంత్ కేసరి రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన తమిళ హీరో..

Show comments