Warangal: వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఫిర్యాదుతో మరోసారి ర్యాగింగ్ వ్యవహారం చర్చనీయాంశమైంది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు సీనియర్లు బూతులు తిడుతూ తీవ్రంగా దాడి చేయడంతో బాధితుడు హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also: Sri Mahalakshmi Stotram: తొలి శ్రావణ శుక్రవారం వింటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి..
హనుమకొండలోని జులైవాడ న్యూ బృందావన్ కాలనీకి చెందిన జాటోతు దిలీప్ కుమార్ అనంతసాగర్ లో ఉన్న ఎస్ఆర్ యూనివర్సిటీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రోజువారీలాగే కాలేజీకి వెళ్లిన దిలీప్ కుమార్ ను మంగళవారం కొంత మంది సీనియర్లు టార్గెట్ చేశారు. మధ్యాహ్నం సమయంలో దిలీప్ కుమార్ లంచ్ చేసేందుకు అక్కడున్న గార్డెన్ లో కూర్చోగా, బీబీఏ థర్డ్ ఇయర్ కు చెందిన శ్రీకేష్, ఫిరోజ్, రిషీద్ మాలిక్, ఫస్ట్ ఇయర్ కు చెందిన నందన్, ఇంకొందరు అతడిని పిలిచారు. దీంతో వారి వద్దకు వెళ్లిన దిలీప్ కుమార్ తనను తనను ఎందుకు పిలిచారని అడిగాడు. దీంతో వాళ్లంతా బూతులు అందుకున్నారు. దుర్భాషలాడటంతో పాటు దిలీప్పై దాడికి దిగారు.
Read also: Off The Record: తెలంగాణకు చుట్టం చూపుగానే కిషన్‌రెడ్డి..! నడిపే నాయకుడి కోసం ఎదురుచూపులు..?
దీంతో గాయాలపాలైన బాధితుడు మంగళవారం సాయంత్రం హసన్ పర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం తమకు సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని, తమ పట్ల బాధ్యత వహించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ర్యాగింగ్ చేసిన వారితో పాటు ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇదే సమయం జూనియర్ పైనా సీనియర్ల దాడి చేసిన విడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నరు హసన్ పర్తి పోలీసులు విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మరో వైపు కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్ లాంటి విష సంస్కృతికి పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో వరంగల్ సీపీ ఒక ప్రకటన విడుదల చేశారు.
Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ రాజ్యంలో విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం