NTV Telugu Site icon

Warangal: మామునూరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి.. సీఎం దిగ్భ్రాంతి

Wgl Accident

Wgl Accident

వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ.. రెండు ఆటోలను ఢీ కొట్టింది. దీంతో.. భారీ ఐరన్ రాడ్లు ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఐనవోలు మండలం పంథిని వద్ద యూరియా బస్తాలు తీసుకెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. అనంతరం మామునూరు దగ్గర మరో ఆటోను ఢీకొట్టి లారీ బోల్తా పడింది.

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. లారీ ఖమ్మం నుంచి వరంగల్ కు వెళ్తుంది.. ఆటో కూడా వరంగల్ వైపే వెళ్తుంది. మృతులు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు వ్యవసాయ పనిముట్లు చేసే వలసజీవులు.. భారీ ప్రమాదం జరగడంతో వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డుకిరువైపులా ఒక కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం అయింది. రోడ్డుపై పడ్డ ఐరన్ రాడ్డులను తొలగించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది.

Modugula Venugopala Reddy: విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారు!

వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్​ ను, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.