NTV Telugu Site icon

Warangal: రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తీసివేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన

Brs Wgl

Brs Wgl

తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసివేయడానికి నిరసిస్తూ ఖిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలన దీక్షకు ప్రతీక అయిన కాకతీయ కళా తోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తన్నట్టు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Ap Police: ఏపీలో గత ఎన్నికలతో పోలీస్తే ఈ సారి భారీగా పట్టుబడ్డ మద్యం, డ్రగ్స్, సొమ్ము

ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర పట్ల వ్యతిరేకత ఉంది.. రేవంత్ రెడ్డి సమైక్యవాది అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా.. తెలంగాణను విచ్ఛిన్నం చేయాలనే శక్తులు రేవంత్ రెడ్డితో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల పాలైందని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిధులు ఉన్నాయి అని చెప్పకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. రాజరిక చరిత్రను మారిపించాలి అంటే జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రాన్ని తీసివేస్తావా అని ప్రశ్నించారు.
సోనియా గాంధీ గారు.. రేవంత్ రెడ్డి ఆలోచనలను మీరు అనుమతి ఇస్తారా అని పేర్కొన్నారు. కాకతీయ కళ తోరణాన్ని తొలగించాలనే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సోనియా గాంధీ తిరస్కరించాలని అన్నారు. రేవంత్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు.. రేవంత్ రెడ్డి ఆలోచలన పైన మీరు దృష్టి పెట్టాలని కోరారు.

Delhi metro: సీటులో చక్కగా కూర్చుని ఇద్దరు మహిళలు ఏం చేశారంటే..!

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పై రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదని వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటు వేశారు.. కేసీఆర్ కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తారు.. రైతులను ఎక్కువ ఆదుకుంటాడు అని ఓటు వేశారన్నారు. అదికూడా 1.8 శాతం ఓట్లతోనే మీరు గెలిచారు.. అది గుర్తుపెట్టుకోండని సూచించారు. కాకతీయ కళా తోరణంలో అప్పటి కాకతీయ రాజుల సుపరి పాలనకు చిహ్నం.. అప్పడి పాడి పంటలకు నిదర్శనమని తెలిపారు. రేవంత్ రెడ్డి మార్చుతం అంటే అంత ఈజీ కాదు.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే చిహ్నం మారుతుంది అంత ఈజీ కాదని అన్నారు. రేవంత్ రెడ్డి ఆలోచనలోపై తాను కేసు వేస్తానన్నారు. వేసవి సెలవుల తర్వాత కోర్టుకు పోతామని వినోద్ కుమార్ తెలిపారు.