రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం రక్తికడుతూ వుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న చేసిన కామెంట్లు మంటలు రాజేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం రచ్చబండలో చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అది కూడా ప్రొఫెసర్ జయశంకర్ సొంతూళ్ళు మాట్లాడడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
రెడ్లకు పగ్గాలివ్వాలంటూ వివిధ రాజకీయ పార్టీలకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్న.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టండి అన్నారు రేవంత్. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి.. పతనం అయ్యాడు. రెడ్లకు అవకాశం ఇవ్వండి.. రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తా. దానికి ఉదాహరణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.
రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు… నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రం లో అధికారంలోకి వచ్చింది పార్టీ. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారు రేవంత్. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు బలహీన వర్గాలకు దూరం అవ్వడమే. రెడ్లు సీఎం, ప్రధాని..రాష్ట్రపతిని బీసీ, ఎస్సీ వర్గాలు చేశాయంటే మనమీద వారికి వుండే నమ్మకమే కారణం అన్నారు. వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నాం. రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దన్నారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి.. పద్మనాయకులను దగ్గరికి తీశాడు. పద్మ నాయకులు అంటే వెలమలు. రెడ్లను పక్కన పెట్టి..వెలమలు దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలి పోయింది. రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కామెంట్లపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
రేవంత్ రెడ్డి కులాలపై మాట్లాడిన మాటలలో అహంకారం ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సో కాల్డ్ బీసీ నాయకులు రేవంత్ మాటలపై చర్చ పెట్టాలి. కులాల వెంట వెళితే ఏదీ రాదని కేసీఆర్ మాకు చెబుతుంటారు. అంతా మేమే అన్నట్టు రేవంత్ మాట్లాడారు. రేవంత్ తన మాటలపై క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి తలసాని.
ఎన్నికల కోసం బ్రోకర్ గాళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్మరు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో జయశంకర్ ను కలిసాడా ? ఇవ్వాళ రేవంత్ రెడ్డి లాంటి ముర్కుడు జయశంకర్ గురించి మాట్లాడుతున్నారు. జయశంకర్ నా గురువు…నేను కలిశాను. జయశంకర్ గ్రామాన్ని అభివృద్ధి చేసింది మేము..కావాలంటే కలిసి వెళదాం. జయశంకర్ మరణం తరువాత ఆయన చిత్ర పటానికి దండ వేశారా? అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి రాష్ట్ర కాంగ్రెస్ ను వేలం పెట్టారు. రేవంత్ రెడ్డి అబద్ధాలకు- మతాలకు అక్రమంగా పుట్టిన నేత.కులాల- మతాల మధ్య రేవంత్ రెడ్డి చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వెధవలు రాజకీయాల్లోకి రావడం దురదృష్టకరం. ప్రజలకు సేవ చేస్తేనే గెలుపు ఉంటుంది…కులాలతో మతాలతో గెలిచిన చరిత్ర లేదు. కులాల మధ్య చిచ్చుపెట్టడం రేవంత్ రెడ్డికి తగదు. టీఆర్‌ఎస్ లో కులాలు, మతాల పంచాయితీ లేదన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. టీఆర్ఎస్ నేతల కామెంట్లు అలా వుంచితే.. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు కూడా రేవంత్ కామెంట్లపై మండిపడ్డారు. దీనిపై పార్టీలో చర్చ జరగాలన్నారు.
Revanth Reddy: రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ