Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ అరెస్ట్..

Delhi

Delhi

Delhi: ఢిల్లీలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. అనేక హత్యల్లో కాంట్రాక్ట్ కిల్లర్ గా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కాంట్రాక్ట్ కిల్లర్ కమిల్ గాయపడ్డాడు. లొంగిపోవాలని కోరినా కూడా కమిల్ పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు తిరిగి జరిపిన కాల్పుల్లో అతను గాయపడ్డారు. తరువాత అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది.

Read Also: France riots: యువకుడిని చంపిన పోలీస్ ఆఫీసర్‌కి ప్రజల మద్దతు.. మిలియన్ యూరోల నిధులు

బుల్లెట్ గాయమైన కమిల్ ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టర్కీ తయారీ జిగానా పిస్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జామా మసీదు ప్రాంతంలో కాల్పులతో పాటు 12కి పైగా కేసులు అతడిపై ఉన్నాయి. జిగానా పిస్టల్స్ పై ఇండియాలో బ్యాన్ ఉంది. ఏప్రిల్ లో జరిగిన అతిక్ అహ్మద్ హత్యలో కూడా ఈ జిగానా పిస్టల్ ని ఉపయోగించారు.

Exit mobile version