అప్పుడప్పుడు వడగళ్ళవాన పడడం కామన్. కానీ కొన్ని ప్రాంతాల్లో చేపల వాన కురవడం మనం అరుదుగా వింటుంటాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నిజంగానే చేపల వర్షం కురిసింది. సోమవారం వేకువజామున ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెల్లవారు జామున భారీ వర్షం కురవడంతో కాళేశ్వరం పల్గుల బైపాస్ రోడ్డు కాలనీలో విచిత్రం చోటుచేసుకుంది.
చేపల సందడి
అక్కడే వున్న కొందరి ఇళ్ళ పరిసరాలలో, అటవీ ప్రాంతంలోని పడిదం చెరువు గుంతలలో చేపలు ప్రత్యక్షం అయ్యాయి. పడిదం చెరువు సమీపంలో ఉపాధి హామీ పనులు జరుగుతుండడంతో కూలీలు గుంతలలో ఉన్న చేపలను గమనించి వాటిని పట్టుకున్నారు. ఇంటి పరిసరాలలోకి చేపలు ఎలా వచ్చాయని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ చేపలను ఎప్పుడూ చూడలేదని స్థానికుడు సమ్మయ్య ఎన్టీవీకి తెలిపారు. పలుచోట్ల కనిపించిన చేపలను చూడడానికి స్థానికులు తరలివెళ్తున్నారు. దీంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది. మృగశిరకార్తెలో చేపలు తినాలని అంటారు. చేపల వాన పడడంతో చేపలు కొనకుండానే ఇంటికి తీసికెళ్ళారు స్థానికులు,ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: సైకిల్‌పై నుంచి కిందపడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్