Viral Fevers: వాతావరణంలో మార్పు.. పిల్లలపై విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్
- వాతావరణం మార్పుతో పిల్లలపై విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్..
- హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పిల్లలపై వైరల్ ఫీవర్ ప్రభావం..
- డెంగ్యూ- టైఫాయిడ్ తో అల్లాడిపోతున్న చిన్నారులు..
- పిల్లలతో నిండిపోతున్న గవర్నమెంట్-ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్..
- ఇష్టారాజ్యంగా డబ్బులు వసూల్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ల యాజమాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Fevers: ఫ్లూ వ్యాధులు టెన్షన్‌ను కలిగిస్తున్నాయి. వైరల్ ఫీవర్ బారిన పడి చిన్నారులు విలవిల లాడుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో పాటు ఈ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. గత రెండు వారాలుగా జ్వర లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పీడియాట్రిక్ వైద్యులు పేర్కొంటున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా ఫ్లూ వైరస్ చురుగ్గా, విజృంభిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వందలాది మంది చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డారని వైద్యులు పేర్కొంటున్నారు. బాధిత పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్నాయని చెప్పారు.
Read also: Sukesh Chandrasekhar: తీహార్ జైలులో సుఖేష్ చంద్రశేఖర్‌కు ఎయిర్ కూలర్.. కోర్టు ఆదేశం
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
- Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
- Hyderabad: బార్బెక్యూ నేషన్‌లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
అయితే..గత రెండేళ్లతో పోలిస్తే హనుమకొండ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్ ప్రభావం చిన్నారులపై కనిపిస్తోంది. చిన్నారులు డెంగ్యూ, టైఫాయిడ్‌తో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్లు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఆస్పత్రికి వస్తున్న పది మంది చిన్నారుల్లో ఆరుగురు ఈ వైరస్ బారిన పడుతున్నట్లు బాలల వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read also: Kalki 2898 AD First Review: కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..టాక్ ఎలా ఉందంటే?
సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కనిపించే ఫ్లూ కేసులు ఈ ఏడాది ముందుగానే వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ఫ్లూ కనీసం పదిరోజులపాటు పిల్లలకు సోకుతుందని సూచిస్తున్నారు. దగ్గు, జలుబు తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రులకు వస్తున్న పది మందిలో ఆరుగురు ఫ్లూ వైరస్ తో బాధపడుతుండగా, మరో ఇద్దరు డయేరియా తదితర సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉదయం పూట విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం నుంచి చల్లటి వాతావరణం, తేమతో కూడిన గాలులు, వర్షాలు కురుస్తుండటంతో వైరస్ చురుగ్గా మారిందని చెబుతున్నారు. ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వారు నివసించే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Read also: Astrology: జూన్ 19, బుధవారం దినఫలాలు
వేడి ఆహారం, గోరువెచ్చని నీళ్లతో చేతులు కడుక్కోవాలి. వర్షంలో తడవకండి. స్కూల్ నుంచి వచ్చాక బట్టలు, షూ, సాక్స్ విప్పేసి స్నానం చేయాలి. వాతావరణం చల్లగా ఉంటే, టవల్‌ను వేడి నీటిలో ముంచి ఆరబెట్టండి. చేతులు, కాళ్లు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య పెద్దలలో నివారించండి. చేతి రుమాలు, ఇతరులు ఉపయోగించే వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలి. కానీ చిన్నారులు జ్వరంతో ఇబ్బందులు పడుతుంటే.. ఇదేం సమస్య అని భావించి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలకు వేలల్లో వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. దీనిపై వైద్యశాఖ స్పందించాలన్నారు.
Rakshith Shetty : ఓటీటీ సంస్థల పై హీరో సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్‌లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!