NTV Telugu Site icon

కమలాపూర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తాం : బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతోంది. ఈ రోజు సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్‌ పర్యటించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ని గెలిపించే బాధ్యత మీది.. హుజురాబాద్‌ అభివృద్ధి మాది అంటూ వ్యాఖ్యానించారు.

కమలాపూర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా హుజురాబాద్‌-జమ్మికుంట అర్బన్‌ డెవలపమ్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వరంగల్‌-హుజురాబాద్‌-మానుకొండూర్‌-కరీంనగర్‌ రైల్వేలైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని, కమలాపూర్‌లో వరి ఆధారిత పుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.