NTV Telugu Site icon

Vinay Bhaskar : రాహుల్ గాంధీకి దేశ సరిహద్దులు తెలుసా..

వరంగల్‌లో రాహుల్‌గాంధీ పర్యటన, సభ నేపథ్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కామెంట్స్‌కు వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు వినయ్ భాస్కర్, అరూరి రమేష్ లు కౌంటర్ ఇచ్చారు. అరూరి రమేశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రైతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని, ఉద్యమ నేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డి కి లేదని ఆయన మండిపడ్డారు.

కరెంటు కోసం ధర్నా చేసిన రైతులను కాల్చి చంపిన పార్టీలో ఉన్న నీవు.. రైతుల కోసం సభలు పెడుతాము అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యాత్రలు చేయటం, సభలు పెట్టిన.. కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. అనంతరం వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పేరు వింటే… ప్రతిపక్షాలకు వణుకు మొదలైందని, టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రతిపక్ష నేతలు జైలు కి ఎందుకు పోయారు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చందుకు జైలు కి వెళ్ళామని, నువ్వు జైలు కి ఎందుకు పోయావు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి క్రమంలో అడ్డంగా దొరికి పోయి జైల్ కి వెళ్లావు అంటూ రైవంత్‌ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి దేశ సరిహద్దు తెలుసా అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు రాహుల్ కి తెలుసా అని, దేశ ప్రధానికి కన్ను కొట్టుడు తెలుసు కౌగిలించుకోవడం తెలుసు.. ఇలాంటి రాహుల్ గాంధీ వరంగల్ లో సభ పెట్టాలని చెప్పారాట. మా రాష్ట్రానికి రైతు కోసం రాకండి. ముందు క్రమ శిక్షణ నేర్చుకోండని ఆయన హితవు పలికారు.