కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండి నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా కరోనా బారి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులు కరోనా బారిన పడితే, ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే ఉండటం చేస్తారు. ఇక పల్లేల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెల్లో కరోనా బారిన పడిన వ్యక్తులు ఊరికి దూరంగా ఉంటున్నారు. కరోనా తగ్గేవరకు గ్రామంలోకి అడుగుపెట్టడంలేదు. అయితే, తెలంగాణలోని ఖమ్మంజిల్లా, అశ్వారావుపేట మండలంలోని మొద్దులమడ గిరిజన గ్రామానికి చెందిన ప్రజలు 50 మందికి కరోనా సోకింది. ఆ గ్రామం జనాభ మొత్తం 150 కాగా, అందులో 50 మందికి కరోనా సోకడంతో కరోనా సోకిన ప్రజలు గ్రామాన్ని వదలి స్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో మిగతా వారికి సోకకుండా ఉండేందుకు, పిల్లలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఉంటూ వంటావార్పు చేసుకొని తింటున్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తరువాత గ్రామంలోకి వస్తామని అప్పటి వరకూ స్మశానంలోనే ఉంటామని చెబుతున్నారు.
ఐసోలేషన్ కేంద్రంగా స్మశానం…ఎక్కడంటే…
