Site icon NTV Telugu

Vikram Singh Mann : తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్

Vikram Singh Mann

Vikram Singh Mann

Vikram Singh Mann : తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విక్రమ్ సింగ్ మాన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్నారు. ఆయనను కొత్తగా విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణరావు ఆగస్టు 28న ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన పదవీ విరమణతో ఖాళీ అయిన బాధ్యతలను విక్రమ్ సింగ్ మాన్ చేపట్టనున్నారు.ఈ నియామకంతో రాష్ట్ర విజిలెన్స్ విభాగం కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు

Drugs : హైదరాబాద్‌లో కొత్త తరహా డ్రగ్స్ మాఫియా.. వస్తువుల మాటున సరఫరా!

Exit mobile version