హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన పలువురు నిందితులు అనంతగిరి అడవుల్లో ట్రైనింగ్ తీసుకున్నాట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి వెల్లడించారు. కొన్ని న్యూస్ ఛానల్స్ మరియు సామజిక మధ్యమాలలో అనంతగిరి అడువులలో “టెర్రరిస్ట్ లకు ట్రైనింగ్” అని వచ్చిన కథనలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
Also Read : Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్
వికారాబాద్ పట్టణం హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నందున చాలా మంది పర్యటకులు అనంతగిరికి వస్తుపోతు ఉంటారు. పర్యటకుల సంరక్షణ నిమిత్తం అనంతగిరిలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. చెక్ పోస్ట్ లు, వెహికిల్ చెకింగ్, డ్రంక్ & డ్రెవ్ లు ఏర్పాటు చేసి వచ్చే పోయే వాహనాలపైనా పత్యేక నిఘా నిత్యం ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. అనంతగిరి గుట్ట పరిసర ప్రాంతాలలోని కాలనీలలో తరుచుగా కార్టన్&సర్చ్ లు మరియు నాకాబందీలు ఏర్పాటు చేసి అనంతగిరి పరిసర ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాకపోకల పైన ప్రత్యేక నిఘా చేపట్టామని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : Priyanka Chopra: నా 17 ఏళ్ళ వయస్సులో నా భర్త.. నన్ను చూస్తూ ఆ పని చేశాడట
అనంతగిరికీ వచ్చే పర్యటకుల రక్షణ మరియు అనంతగిరికీ వచ్చిపోయే వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. కాబట్టి జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మోద్దని ఆయన సూచించారు. ఇలాంటివి నమ్మి భయాందోళనలకు గురికావద్దు అని ఎస్పీ వెల్లడించారు. జిల్లా ప్రజల శాంతిభద్రతల సంరక్షణలో జిల్లా పోలీసులు ఎల్లపుడూ ముందు వరసలో ఉంటారన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గ్రహించాలి.. దయచేసి ఎవ్వరూ కూడా దుష్ప్రచారం చేసి ప్రజలలో ఆందోళనలను కలిగించవద్దు.. ఇలాంటి విషయాలపైన ఏమైనా సాక్ష్యధారాలు ఉన్నట్లు అయితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ N. కోటి రెడ్డి తెలిపారు.