NTV Telugu Site icon

Lagacharla Case: నరేందర్‌రెడ్డి, సురేష్ సహకరించట్లేదు.. కస్టడీని మరో రెండు రోజులు పొడిగించండి..

Lagarcharla Insident

Lagarcharla Insident

Lagacharla Case: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కస్టడీలో ఉన్న నరేందర్ రెడ్డి తమకు సహకరించట్లేదంటూ పోలీసులు నివేదిక ఇచ్చారు. మరో రెండు రోజులపాటు కస్టడీని పొడిగించాలని పోలీసులు నివేదికలో కోరారు. లగచర్ల ఘటనలో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కోర్టు అనుమతితో రెండు రోజులు పోలీసులు కస్టడీకి తీస్కుని విచారిస్తున్న విషయం తెలిసిందే.

Read also: Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్‌ చేసిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు

అయితే పట్నం విచారణకు సహకరించ లేదని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని పోలీసులు నివేదించారు. మరో ప్రధాన నిందితుడు సురేష్ ఇచ్చిన వివరాల ఆధారంగా కోస్గికి చెందిన ఎక్సైజ్ అధికారుల నుండి మద్యం విక్రయాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఘటనలకు ముందు స్థానికులకు సురేష్ మందు పార్టీలు ఇచ్చినట్లు సమాచారం. పట్నం, సురేష్ ను కలిపి విచారించడానికి మరి కొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరనున్నట్లు సమాచారం!

Read also: Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్‌కు కెనడా ప్రధాని ట్రూడో వార్నింగ్..

ఫార్మా సిటీ కోసం అభిప్రాయ సేకరణకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని లగచర్లకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు దాడికి పాల్పడిన 16 మందికి పైగా గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అనుచరుడు భోగమోని సురేష్ లను కస్టడీలోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. అయితే వీరిద్దరూ విచారణ సహకరించటం లేదని కోర్టుకు పోలీసులు నివేదిక ఇవ్వనున్నారు.
MLC Kavitha: హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దు..