Site icon NTV Telugu

Kale vs Patnam Clashes: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వాగ్వాదం

Kale Yadaiah

Kale Yadaiah

Kale vs Patnam Clashes: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే యాదయ్య మధ్య అగ్ని వేస్తే భగ్గుమంటుంది. వికారాబాద్ జెడ్పీ ఆఫీసు ప్రారంభ కార్యక్రమంలో ఈ గొడవ స్టార్ట్ అయింది. అసంపూర్తిగా ఉన్న భవనం ప్రారంభించడం ఏంటని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రశ్నించారు. దీనికి, భవన నిర్మాణ కాంట్రాక్టు మహేందర్ రెడ్డిదే కదా..! జెడ్పీ భవనం పూర్తి చేయాల్సింది అంటూ ఎమ్మెల్యే యాదయ్య సెటైర్ వేశారు.

Read Also: Pranava One Hyderabad: ఎకో లగ్జరీ అనే గొప్ప కాన్సెప్ట్‌తో ‘ప్రణవ వన్‌ హైదరాబాద్’

అయితే, ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకునే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఏం మేము మాట్లాడ వద్దా అంటూ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య కలుగజేసుకొని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వివాదం సద్దుమణిగించారు. ఇక, వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన కార్యాలయాన్ని హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ తో కలిసి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సదర్బంగా జడ్పీ ఆఫీసు ప్రారంభించిన తర్వాత సునీతా రెడ్డి కుర్చీలో కుర్చున్నారు.

Exit mobile version