వికారాబాద్ జిల్లా తాండూర్లో చిరుత పులి కూనలు ప్రత్యక్షమయ్యాయి.. గత నెల 28న కోటబాస్ పల్లి పరిసరాల్లో చిరుత పులి కూనలను గ్రామస్తులు గుర్తించారు. అయితే.. ఓ కూన పిల్లను గుర్తించి అటవీ శాఖ వైద్యులు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం.. పులి కూన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా మరో పులి కూనను డ్రైవర్ జావిద్ గుర్తించారు. మల్కాపూర్ పరిసరాల్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర చెట్లలో పులి పిల్ల తిరుగుతున్నట్లు జావిద్ గుర్తించాడు.
కాగా.. వెంటనే అతను అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. అటవీ శాఖ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని పులికూన కోసం గాలిస్తున్నారు. రెండు పులి కూనలు ఈ ప్రాంతంలోనే కనబడడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల తల్లి కూడా ఇక్కడే సంచరిస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో.. అటవీశాఖ అధికారులు పొలాల దగ్గరకు వెళ్లే వారు ఒంటరిగా వెళ్లొద్దని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Also: Harish Rao: నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం పరువు పోతుంది..