Vikarabad Sireesha Sister Srilatha Talks About Sireesha Death: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్‌లో శిరీష అనే 18 ఏళ్ల యువతి అత్యంత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే! గుర్తు తెలియని దుండగులు బ్లేడుతో ఆమె గొంతు కోసి చంపి, ఆపై స్క్రూడ్రైవర్‌తో రెండు కళ్లను ఛిద్రం చేసి.. ఓ నీటి కుంటలో పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా తమ చెల్లెలు మృతిపై శిరీష అక్కడ శ్రీలత చెప్పుకొచ్చింది. తమ చెల్లెలు దారుణ హత్యకు గురైందని.. తమ ఇంటికి కీలోమీటర్ దూరంలో ఉన్న నీటి కుంటలో ఆమె శవమై తేలిందని భావోద్వేగానికి లోనైంది. తమకు ఎవరిమీదా అనుమానం లేదని తెలిపింది.
Kriti Sanon: అతను నాతో అసభ్యంగా ప్రవర్తించి, అవమానించాడు.. సీత షాకింగ్ కామెంట్స్
అయితే.. తమ చెల్లి (శిరీష) మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్ లాక్ వేసి ఉందని, పోలీసులు దాన్ని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని శ్రీలత చెప్పింది. బ్లేడుతో గొంతు కోసి శిరీషను హత్య చేశారని, స్క్రూడ్రైవర్‌తో రెండు కళ్లలో పొడిచి, నీటి గుంటలో పడేశారంటూ రోదించింది. శనివారం రాత్రి శిరీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని పేర్కొంది. ఆమె కోసం తాము అన్ని చోట్లా వెతికామని, తెలిసిన వారిని సంప్రదించినా ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. అయితే.. తాము వెతికే క్రమంలో తమ మేనమామ శిరీషను నీటి సంపులో పడి ఉండటాన్ని గమనించారని, అప్పుడు ఆమె శవాన్ని తాము బయటకు తీశామని చెప్పుకొచ్చింది. శిరీషను ఆ పరిస్థితిలో చూసి తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది.
Harish Rao: తెలంగాణ హెల్త్ హబ్‌గా.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగాయి
తమ తల్లికి కొంతకాలం నుంచి ఆస్తమా సమస్య ఉందని.. ప్రస్తుతం తమ తల్లి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని శ్రీలత పేర్కొంది. తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. ఇంట్లో తను, శిరీష, అన్న, తమ్ముడు ఉంటున్నామని తెలిపింది. అయితే.. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటిపర్యంతం అయ్యింది. తమ అక్కను చంపిన వాళ్లను వెంటనే పట్టుకొని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా.. శిరీష మరణం స్థానికంగా సంచలనంగా మారింది. మరోవైపు.. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, నేరస్తులెవరో కనుగొని, వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.