Site icon NTV Telugu

Vijayashanti Tweet: హరీష్ రావు కామెంట్స్‌కు విజయశాంతి కౌంటర్

Vijayashanti

Vijayashanti

Vijayshanti Tweet: కాంగ్రెస్ నేత విజయశాంతి మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘సుమారు 10 సంవత్సరాల తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకు బాధ్యులైన నాటి బీఆర్ఎస్ మంత్రులు మూడు దినాలల్లనే నూతన సర్కారు అన్ని హామీలను అమలు చేయాలని ప్రశ్నించడం

ప్రతిపక్షంగా అన్ని తెలిసి చేస్తున్న మోసపు ప్రకటనల ప్రయత్నం, ఓటమి తట్టుకోలేని వ్యక్తుల వివాదం.. విజ్ఞత, బాధ్యతాయుత ధోరణితో ఉండే గత ఆర్థిక మంత్రి హరీష్ రావు గారితో కూడా ఇట్ల ఎందుకు మాట్లాడిస్తున్నరో దవాఖానలో ఉన్న కేసీఆర్ గారు… తెల్వదు.. ఐనా, మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదు అన్నది వాస్తవం… అందుకై మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని విమర్శించే శక్తులను సమర్ధవంతంగా తిప్పికొట్టి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యాచరణను నిరంతరం ప్రజలకు చేర్చవలసిన బాధ్యత.. ఈ సందర్బంగా తెలంగాణ బీఆర్ఎస్ నియంతృత్వ గడిల నుండి విముక్తి కై కొట్లాడి నేటి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకై పనిచేసిన మన వంటి తెలంగాణ ప్రజాస్వామ్యవాదులుపై ప్రస్తుతం తప్పక ఉన్నది’ అంటూ విజయశాంతి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Exit mobile version