Site icon NTV Telugu

Vijayashanthi: త్వరలో రాములమ్మ ప్రచారం.. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ లో పర్యటన

Vijayashanthi

Vijayashanthi

Vijayashanthi: బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి త్వరలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారులోని నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జెట్ స్పీడ్‌లో సాగుతున్నదని విజయశాంతి అన్నారు. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 28వ తేదీ నాటికి పక్కా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కొందరు నేతల విమర్శలకు రాములమ్మ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఆ విమర్శలను తాను ఆశీస్సులుగా తీసుకుంటానని రాములమ్మ అన్నారు.

బీజేపీని వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరాల్సి వచ్చిందో అంతకుముందు విజయశాంతి చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడేళ్లు జెండా ఎగురవేసిందన్నారు. సంజయ్, కిషన్ రెడ్డి తదితర నేతలు తన వద్దకు వచ్చి బీఆర్ ఎస్ అవినీతిపై చర్చిస్తామని చెప్పారని విజయశాంతి తెలిపారు. మీరంతా మద్దతిస్తే భాజపాపై పోరాటం చేస్తామని తాను, వివేక్‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. వారంతా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని విజయశాంతి అన్నారు. మనకు ద్రోహం చేసి బీఆర్‌ఎస్‌తో రాజీపడి చాలా మంది నేతలు బీజేపీని వీడారని పేర్కొన్నారు.

Read also: Virat Kohli: ప్రపంచకప్‌ ట్రోఫీ రాకపోయినా.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ మనోడికే దక్కింది!

విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో టీ కాంగ్రెస్‌లో విజయశాంతికి సముచిత స్థానం కేటాయించారు. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార కమిటీని, ప్రణాళికా సంఘాన్ని నియమించింది. ఇందులో 15 మందికి కోఆర్డినేటర్‌ పోస్టులు ఇచ్చారు. విజయశాంతిని ప్రచార కమిటీ, ప్రణాళికా సంఘంలోకి తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా విజయశాంతి నియమితులయ్యారు. మహేశ్వరం టికెట్‌ ఆశిస్తున్న పారిజాతకు కన్వీనర్‌ పదవి దక్కింది. అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. 15 మందిలో సమన్వయకర్త ఎవరు? సమన్వయకర్తలుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేంద్రరెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాతరెడ్డి, సిద్ధేశ్వర్ అలీబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఒబేద్దుల కొత్వాల్, రామమూర్తి నాయక్ తదితరులున్నారు.
Minister KTR: నేడు మిర్యాలగూడలో కేటీఆర్‌ రోడ్‌ షో.. మధ్యాహ్నం యాదగిరిగుట్టలో..

Exit mobile version