లాక్డౌన్ కేసీఆర్‌కు వరంలా మారింది.. అందుకే ఆస్పత్రుల పర్యటనలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని ఆశలు కల్పించారు. వరంగల్ని టెక్స్టైల్ హబ్ చేస్తానన్నారు. హైదరాబాదు నుంచి ఐటీ కంపెనీలు వరంగల్ వచ్చేలా చేస్తానన్నారు. ఇవిగాక చిన్నా చితకా హామీలు ఇంకెన్నో ఆయన నోట్లోంచి ముత్యాల్లాగా రాలాయి. చివరికి గతేడాది వరదల్లో ఈ హామీలన్నీ కొట్టుకుపోయాయి. మళ్ళీ అక్కడకు వెళితే ఎక్కడ జవాబు చెప్పుకోవాల్సి వస్తుందోనని భయపడుతూ వచ్చిన సీఎం గారికి తాను విధించిన ఈ కరోనా లాక్డౌన్ పెద్ద వరంలా మారింది. ప్రజలందరూ ఇళ్ళలోనే ఖైదీల్లా కాలం గడుపుతున్న సమయం చూసుకుని ఎంజిఎంని చుట్టేసి వచ్చారు. ప్రజల కంటబడితే ఎక్కడ నిలదీస్తారోనన్న ఆందోళనతో బిక్కు బిక్కుమంటూ బతికే పరిస్థితికి సీఎం దిగజారిపోయారు. ఏదిఏమైనా సంవత్సరాల పాటు ప్రజలకు, MLA లకు, నెలలు పాటు మంత్రులకు అనుమతులు ఉండని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి గారు జిల్లాలలో ప్రజాగ్రహనికి గురి కాకుండా ప్రయత్నించటానికి, ఈ లాక్ డౌన్ గొప్ప అవకాశమని భావిస్తున్నట్లు కనిపిస్తుంది.” అంటూ ఫైర్ అయ్యారు విజయశాంతి.
Also Read
- Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్‌ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!