NTV Telugu Site icon

V.Hanumantha Rao: రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని.. బీజేపీపై వీహెచ్‌ ఫైర్‌

Vh

Vh

V.Hanumantha Rao: బీజేపీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఫైర్‌ అయ్యారు. రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది నిజాం వల్లనే అని స్పష్టం చేశారు. నిజాం కి కనీసం బంద్ కాల్ ఇస్తే బాగుండేదని తెలిపారు. అంత్యక్రియలు అయ్యే వరకు అయినా.. పాటిస్తే బాగుండేదని అన్నారు వీహెచ్‌. బీజేపీ.. ఆర్‌ఎస్‌ఎస్‌ కి భయపడ్డాడు కేసీఆర్‌ అంటూ ఎద్దేవ చేశారు. మేము సెక్యులర్.. నువ్వు సెక్యులర్ అంటావని తెలిపారు. ఎందుకు నిజాంని గౌరవించలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ హిందు.. ముస్లిం పేరుతో పంచాయతీ చేస్తుందని మండిపడ్డారు.

Read also: <a href=”https://ntvtelugu.com/movie-news/aishwarya-rai-bachhan-receives-legal-notice-from-nashik-district-court-303041.html”>Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కి లీగల్ నోటిస్… పది రోజుల్లో కట్టకుంటే…</a>

రాముడు చెప్పాడా.. దేశంలో హిందువులే ఉండాలని అంటూ ఫైర్‌ అయ్యారు. తన రాజ్యాంలో కూడా హిందు.. ముస్లింలు సమానంగా చూశారు రాముడు అంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ సీఎంగా మోడీ చేసిన అరాచకాలు ఎన్ని లేవని మండిపడ్డారు వీహెచ్‌. నిజాం కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు.. ఒకే కారణం చూపి దోషిగా చూడటం సరికాదన్నారు. ఎనిమిది ఏండ్లలో బీజేపీ పేదలకు ఏం చేసింది చెప్పాలి? అని ప్రశ్నించారు. మోడీ రిమోట్ కంట్రోల్ నాగపూర్ లో ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యల కొనుగోలు కేసు ఇక్కడ సిట్ విచారణ జరుగుతుంటే.. బీజేపీ సీబీఐకి ఇచ్చిందని ఇది బీజేపీ ధ్వందనీతి అన్నారు వీహెచ్‌.

Read also: <a href=”https://ntvtelugu.com/telangana-news/brs-first-public-meeting-live-303015.html”>BRS First Public Meeting Live: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ</a>

కేసీఆర్ తలపెట్టిన ఖమ్మం సభకు తన వల్ల లబ్దిపొందిన నాయకులు వచ్చారని మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు చెప్పిన రీతిలో పాలన నడుస్తుందా.?అంటూ ప్రశ్నించారు. క్రాఫ్ లోన్ కేవలం 18 లక్షల మందికే అందాయని తెలిపారు. 16 లక్షల మంది రైతుల ఖాతాలు npl గా మారిపోయాయని గుర్తుచేశారు. కేసీఆర్ ఇస్తానన్న రుణమాఫీ చేయకపోవడం తోనే రైతుల ఖాతాలు npl గా మారిపోయాయని తెలిపారు. ఖమ్మం రైతులకు బేడీలు వేసి.. ఇప్పుడు అక్కడే సభ పెడుతున్నాడని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన కేసీఆర్ ది రైతు రాజ్యం అట అంటూ ఎద్దేవ చేశారు.
<a href=”https://ntvtelugu.com/news/cm-kcr-started-from-yadadri-to-khammam-303025.html”>High Court: ఇద్దరు అధికారులకు హైకోర్టు శిక్ష.. సాయంత్రం వరకు హాల్‌లోనే నిలబడండి..</a>