ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: సోషల్‌మీడియా సాయంతో ఆర్టీసీ సమస్యలకు చెక్
ధాన్యం తీసుకోకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై నెపం నెట్టివేయాలని కేంద్రం చూస్తోందని ఆయన అన్నారు. బీజేపీ తన విధానాలను మార్చుకోకపోతే ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. ఇక్కడి రైతులు రైతులు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ పై ఎందుకు వివక్ష చూపుతున్నారో ప్రధాని మోడీ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి పునరాఆలోచించుకోవాలని ఆయన అన్నారు.
