Site icon NTV Telugu

Vemula Prashth Reddy : పీయూష్ గోయల్ ది కండ కావరం

Telangana Minister Vemula Prashanth Reddy Fired on Union Minister Piyush Goyal.

ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయండపై కేంద్రం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఈ నేథ్యంలో ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులు నేడు మీడియా సమావేశం నిర్వహించి ఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలో మేము అవమానాలు పడ్డామని ఆయన వెల్లడించారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలపై అవమానకరంగా మాట్లాడారని, అది మాకు చాలా ఆవేదన …బాధ కల్గించిందన్నారు. పక్కా వ్యాపారి మాట్లాడినట్టు కేంద్ర మంత్రి పీయూష్ మాట్లాడారని, పీడీఎస్‌లో నూకల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని పీయూష్ గోయల్ మాకు సలహా ఇచ్చారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ మీద కేంద్రం ఎందుకు కక్ష్య సాధిస్తుందో కిషన్ రెడ్డి కి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. పీయూష్ గోయల్ ది కండ కావరమని, పీయూష్ గోయల్ ఖబడ్దార్ …తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి …ఆ కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Exit mobile version