NTV Telugu Site icon

Vemula Prashanth Reddy: మోడీ, అమిత్ షా.. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరులు

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy Sensational Comments On Narendra Modi: ఈ ప్రపంచంలో అత్యంత అవినీతిపరులైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే.. అది ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వేత్తలకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకుల రుణమాఫీ చేసిన నీచమైన ఘనత మోడీదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసీలను కూడా ప్రైవేటుపరం చేయాలని దగుల్‌బాజి బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో.. నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు చొప్పున పే ప్రజల ఖాతాలోకి వేస్తానని మోడీ చెప్పారని, ఏ ఒక్క పేదోడి ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదని చెప్పారు. ఒక్క పని కూడా చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ ఒక చేతకాని దద్దమ్మ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు.

కాగా.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన రోడ్డు భవనాల అతిథి గృహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతో, రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఆర్ & బీ ప్రతిపాదనల్లో 4 మాత్రమే మంజూరు చేశామన్నారు. అందులో పెద్దపల్లికి చోటు దక్కిందని తెలిపారు. ఆర్ & బీ శాఖ ద్వారా మొత్తం 1,458 కోట్ల పనులు మంజూరు చేసుకున్నామని, రూ.680 కోట్ల ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేశామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు, సాగు నీటి ప్రాజెక్టుల ఫలితంగానే.. పెద్దపల్లి జిల్లాలో వరి సాగు పెరిగిందన్నారు. 2014లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో 98 వేల ఎకరాల్లో వరి సాగు జరిగితే.. ఇప్పుడు 1.58 వేల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. నిబద్దతతో పనిచేయడం వల్లే.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడిస్తోంది.