సీఎం కేసీఆర్ గడువు విధించిన లోపు అమరుల స్మారక చిహ్నాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాణానికి అవసమరమైన స్టెయిల్ లెస్ స్టీల్ ప్యానెల్స్ దుబాయ్ నుంచి త్వరగా దిగుమతి అయ్యేట్లు చూడాలని.. క్లాడిండ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులు అర్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా పినిషింగ్ వర్క్ ఉండాలన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో కూడా వేగం పెంచాలని.. సీఎం విధించిన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎలివేషన్ పనులు, జీఆర్సీ, క్లాడింగ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గ్రాండ్ ఎంట్రీ నిర్మాణం, ఫినిషింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ప్రశాంత్ రెడ్డి. మూడు షిఫ్టుల్లో మ్యాన్ పవర్ పెంచి పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి తెలంగాణ సిద్ధం అవుతోంది. జూన్ 2కు మరో కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్రావతరణ ఏర్పాట్లను పరిశీలించారు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. పోలీసులు మాక్ డ్రల్ ను పరిశీలించి వివిధ శాఖల ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన విధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 2న జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పించి, పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకుని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పబ్లిక్ గార్డెన్ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం.
