NTV Telugu Site icon

Vemula Prashanth Reddy : మిడతల దండులా నడ్డా, రాహుల్ తెలంగాణ మీద పడ్డరు

Vemula Prashanth

Vemula Prashanth

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఆదివారం చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నడ్డా…కాంగ్రెస్ రాహుల్ గాంధీ మిడతల దండులా తెలంగాణ మీద పడ్డరంటూ విమర్శలు చేశారు. పచ్చబడుతున్న తెలంగాణను ఆగం చేయాలనుకుంటున్నారా.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు..? అని ఆయన ప్రశ్నించారు.
కరెంట్ ఇస్తలేరని బీహార్‌లో రైతులు ట్రాన్స్ఫార్మర్ తగులబెట్టారు అని, దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్ అని ఆయన మండిపడ్డారు.

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నమన్నారు. ఇప్పుడు అరవింద్‌ను పసుపు రైతులు ఏ ఊరికి పోయిన తరిమికొడుతున్నరని, రేవంత్ రెడ్డివి అన్ని బుడ్డర్ ఖాన్ మాటలు అంటూ ఆయయ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ అభివృద్ది తప్పా అన్ని మాట్లాడుతడు అని, బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రజలే నిలదీయాలన్నారు. మీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి సంక్షేమ కార్యక్రమాలు చూపించండి అని అడగాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.