Site icon NTV Telugu

CM K.Chandrashekar Rao: దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తాం..

Cm Kcr

Cm Kcr

CM K.Chandrashekar Rao: బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌తో వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు తమిళనాడు ఎంపీ తిరుమావళవన్ శాలువా కప్పి సన్మానించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ లో దళితుల అభివృద్ది కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, తెలంగాణ స్పూర్తి తో దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వున్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తామని వెల్లడించారు.

CPI Narayana : ఆ యాప్‌ల కట్టడి చేయడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం

తెలంగాణలో దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నానని, దళితుల కోసం ఇన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదని వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్ ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు గొప్ప పథకమని అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారిని కలిసిన వారిలో వివిధ రాష్ట్రాల రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్ (ఒడిశా), సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ (ఢిల్లీ), సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్ (హర్యానా) , మహారాష్ట్ర రైతు నాయకుడు దశరథ్ సావంత్ తదితరులు ఉన్నారు.

Exit mobile version