Site icon NTV Telugu

హుజురాబాద్ లో వినూత్న రీతిలో దండోరా

హుజురాబాద్ ఎన్నికల అనంతరం వినూత్న రీతిలో దండోరా వేశారు. గ్రామ ప్రజలకు తెలియచేయునది. నిన్నటి వరకూ ఓట్ల పండుగ అయిపోయింది. మన పనులు మనమే చేసుకోవాలి. మొన్నటి వరకూ రాజకీయ నాయకులు వచ్చేవారు. ఇప్పుడు మనమే పోవాలి. మన ఛాయ్ మనమే తాగాలి. మన బువ్వ మనమే తాగాలి. బిర్యానీ మనమే తెచ్చుకోవాలి. మన మందు మనమే తాగాలి.

ఉప ఎన్నిక సందర్భంగా వివిధ పార్టీల నేతలు ఊళ్ళలో సందడి చేశారు. ఆ హడావిడి అయిపోయింది. వాళ్ళకి మనతో పనైపోయింది. ఇక మన పనులు మనమే చేసుకోవాలి. మనకు ఆకలేస్తే మనమే వండుకుని తినాలి. అంతా అయిపోయిందంటూ దండోరా వేసి మరీ ఓటర్లకు అసలు విషయం చెబుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version