NTV Telugu Site icon

Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్.. నాలుగు స్టేషన్లలో హాల్ట్

Vandy Bharath

Vandy Bharath

Vande Bharat: హైదరాబాద్-బెంగుళూరు మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి ఈరోజు ఒకే సమయంలో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. ఈ రైలు ఏపీ మీదుగా కర్ణాటక వెళ్లనుంది. ఈ రైలు మూడు రాష్ట్రాలను కలుపుతుంది. నేడు ప్రారంభం కానున్న ఈ రైలు.. రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌కు 8 కోచ్‌లు ఉంటాయి. ఈ రైలులో 530 మంది ప్రయాణికులకు సీట్లు ఉన్నాయి. టికెట్ బుకింగ్ సదుపాయం ప్రారంభం.. క్యాటరింగ్ చార్జీలతో సహా ఒక్కో ప్రయాణికుడికి ఏసీ చైర్ కార్ ధర రూ.1,600గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ టికెట్ ధర రూ.2,915. మీకు క్యాటరింగ్ వద్దనుకుంటే, AC చైర్ కార్ టికెట్ రూ.1,255 మరియు ఎగ్జిక్యూటివ్ టికెట్ రూ.2,515గా నిర్ణయించబడింది.

Read also: Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ పక్కా వస్తాయి..!

ఈ రెండు నగరాల మధ్య దూరం 610 కి.మీ. ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ మార్గం మధ్యలో నాలుగు స్టేషన్లలో ఆగుతుంది. రైలు కాచిగూడ నుండి ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 6.49 గంటలకు మహబూబ్‌నగర్‌, 8.24 గంటలకు కర్నూలు, 10.44 గంటలకు అనంతపురం, 11.14 గంటలకు ధర్మవరం, మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ వందే భారత్ సేవలు బుధవారం మినహా వారానికి 6 రోజులు అందుబాటులో ఉంటాయి. సెలవుదినం రైలు నిర్వహణ కోసం ఉపయోగించబడుతుంది.

కాచిగూడ స్టేషన్‌లో జరిగే రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులకు ఆహ్వానాలు పంపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ-తిరుపతి మధ్య రైళ్లు నడుస్తున్నాయి. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఐటీ సిటీలుగా పేరొందిన బెంగళూరు, హైదరాబాద్ మధ్య చాలా మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నగరాల మధ్య రైలు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. కాగా, విజయవాడ-చెన్నై మధ్య ఈరోజు మరో రైలు ప్రారంభం కానుంది. దీంతో ఏపీలో నాలుగు వందల భారత్ రైళ్లు మాత్రమే నడుస్తాయి.
Rakshit Shetty: మొదటి రోజే బ్రేక్ ఈవెన్… ఆల్ షోస్ హౌజ్ ఫుల్

Show comments