Site icon NTV Telugu

ACB: ఏసీబీకి వలలో వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్‌

Acb

Acb

ACB: వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం– తుర్కయాంజల్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఉన్న 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌ను సంప్రదించాడు. ఈ సందర్భంగా ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం రాజేశ్ రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. తర్వాత చర్చల అనంతరం రూ.70 వేల వద్ద ఒప్పందం కుదిరింది. దీంతో ఆ స్థల యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు రెడీ చేసిన ట్రాప్ ఆపరేషన్‌లో, రూ.70 వేల లంచం మొత్తాన్ని డాక్యుమెంట్ రైటర్ రమేశ్ తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. విచారణలో అతడు సబ్‌రిజిస్ట్రార్ సూచన మేరకే డబ్బులు స్వీకరించినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌తో పాటు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

AP Liquor Scam Case: సిట్ విచారణ.. సంచలన విషయాలు బయటపెట్టిన నారాయణస్వామి..!

Exit mobile version