రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 100 మందితో పట్టపగలు యువకులతో వెళ్లి ఇంట్లో వైశాలి అనే యువతిని మిస్టర్ టీ షాప్ ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేయడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కొన్ని గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కటించి.. ప్రధాన సూత్రధారైన నవీన్ రెడ్డి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. నవీన్ రెడ్డితో పాటు ఇప్పటికీ 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. వైశాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు.. ఆమె వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా వైశాలి మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్ చేసేందుకు వచ్చినవాళ్లు తనను చాలా ఘోరంగా ట్రీట్ చేశారని ఆమె ఆరోపించారు.
Also Read : BIG BREAKING : పోలీస్ శాఖలో 3,966 పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం
‘ మా నాన్న ను చంపేస్తామని బెదిరించారు. నవీన్ తో నాకు పెళ్ళి కాలేదు. ఫోటోలు కూడా మార్ఫింగే. దారుణంగా కొట్టారు. హెల్ప్ అని అరుస్తుంటే గోళ్తో గిచ్చారు. కొరికారు. ఇష్టం లేదని చెప్తున్నా వినిపించుకోలేదు. నీ ఇష్టంతో పని లేదన్నాడు. వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావని ఘోరంగా కొట్టాడు. మానాన్న కూడా చిన్నప్పడు నన్ను కొట్టలేదు. కారులో నవీన్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. నాతో 10 మంది దారుణంగా వ్యవహరించారు. నా కెరీర్‌ను నాశనం చేశారు. ప్లీజ్.. ప్లీజ్ అంటున్నా కాళ్లు పట్టుకొని లాగారు. మాతో కలిసి నవీన్ బాడ్మింటన్ ఆడేవాడు.. నేనంటే ఇష్టమని చెప్తే పేరంట్స్‌ను అడగమని చెప్పా. నవీన్‌తో పరిచయం ఉంది కానీ.. ప్రేమ లేదు. నవీన్ నాకు ప్రపోజ్ చేస్తే నో చెప్పా. నా పేరుతో నకిలీ ఇన్‌స్టా అకౌంట్‌ను క్రియేట్ చేశారు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఫిర్యాదు కూడా ఇచ్చా. పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే నాపై దాడి జరిగి ఉండేది కాదు. కిడ్నాప్ చేసిన నవీన్, అతని ముఠాను కఠినంగా శిక్షించాలి’ అని వైశాలి వెల్లడించింది.