వ్యాక్సినేషన్‌లో రాష్ర్టం స్పీడ్ పెంచింది. ఓవైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అందరికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ముందుకెళ్తుంది.ఈ నెల 22లోగా కరోనా తొలిడోసు వ్యాక్సినేషన్‌ను 100శాతం పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాలు కలిపి 98శాతం మందికి తొలిడోసు ఇవ్వగా..16 జిల్లాల్లో 100శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. 3 జిల్లాల్లో 99 శాతం వ్యాక్సినేషన్, 8 జిల్లాలో90 శాతానికి పైగా, 6 జిల్లాలో 90శాతం లోపు వ్యాక్సినేషన్ జరిగింది. కాగా కరీంనగర్‌లో జిల్లాలో 82శాతం మందికి రెండో డోసు ఇచ్చారు.
రెండో డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా, ఒమిక్రాన్ వేరింయట్‌లను ఎదుర్కొవడానికి అవకాశం ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఇప్పటి కిప్పుడు పెద్ద ముప్పు లేకున్నా వస్తే ఎదుర్కొవడానికి సంసిద్ధంగా ఉండాలని అధికారులు భావిస్తున్నారు. దీన్లో భాగంగే రాష్ర్టంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకాలు తప్పని సరిగా వేయించాలని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు టీకాల్లో రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలంటే టీకా ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులు భావిస్తున్నారు.
