కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే దిశగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను అనుమతి ఇచ్చిన సర్కార్.. మరోవైపు కరోనా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగిస్తుంది.. దీనిలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు.. రేపటి నుండి మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుండి కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభం అవుతుంది.. మూడు రోజుల్లో వాక్సినేషన్ పూర్తి చేయాలని.. ఇందుకు సంబంధించి ఆర్టీసీ, వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రి హరీష్‌రావు. మరోవైపు.. 10 రోజుల బ్రేక్ తర్వాత.. తెలంగాణలో రెండో డోసు టీకాలు తిరిగి పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
3 రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
TSRTC