V. Hanumantha Rao Comments on congress party, gulam nabi azad: ఏఐసీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని.. భారతదేశంలో ఈ ఎన్నికల గురించి ఆలోచన మొదలైందని అన్నారు కాంగ్రెస్ సీనియర నేత వీ హన్మంతరావు. కొందరు గాంధీ కుటుంబం కాకుండా బయటి వారిని పెట్టాలని అంటున్నారని..మిగతా వారిని పెడితే కాంగ్రెస్ నాయకత్వం గ్రామగ్రామానికి వెళ్లడం కష్టం అని అన్నారు. రాహుల్ గాంధీ ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదని..ప్రియాంకా గాంధీ ఉన్నా పార్టీకి మేలు జరుగుతుందని వీహెచ్ ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కుటుంబం గాంధీ కుటుంబం అని.. ప్రధాని పదవిని వదులుకున్న సోనియా కుటుంబం నుంచి అధ్యక్షుడు వస్తే బాగుంటుందని ఆయన అన్నారు.
గతంలో సంజయ్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితే ఇప్పుడు వచ్చిందని అంటున్నారని.. పార్టీ కష్టకాలంలో కొంత మంది
పార్టీని వీడటం బాధాకరం అని అన్నారు. సంజయ్ గాంధీ మా రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రైమరీ మెంబర్ షిప్ చేయని ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను ఆపేశానని.. ఆ నాడు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అవుతుండే వాడిని అని వీహెచ్ అన్నారు. నా మీద కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చారని అన్నారు.
Read Also: CPI Narayana: జూనియర్ ఎన్టీఆర్‌కు ఏం ఖర్మ పట్టిందని అమిత్ షాను కలిశారు..?
నేను, గులాం నబీ ఆజాద్ ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని.. హిమాచల్ ప్రదేశ్ కు ఆనంద్ శర్మ పీసీసీగా చేశారని వీహెచ్ అన్నారు. మీరు రాజీనామా చేయకుంటే పార్టీ మీ మాట వినేదని ఆజాద్ గురించి అన్నారు. తెలంగాణలో నాకు అన్యాయం జరుగుతుందని.. నేను పార్టీ మారలేదని అన్నారు. పార్టీలో ఉన్నత పదవులు అనుభవించిన ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. ఒకప్పుడు బీజేపీలో ఇద్దరే ఉండే వాళ్లు.. వారు పార్టీ మారలేదని.. ఇప్పడు బీజేపీ పుంజుకుందని అన్నారు. 42 ఏళ్లు పదవుల్లో ఉన్న వ్యక్తి ఆజాద్ అని అన్నారు. ఆజాద్ రాజీనామా చేయకుంటే ఆయనకు విలువుండేదని అన్నారు.
1992లో ఒక బీసీకి అవకాశం వస్తే నువ్వే చెడగొట్టావని ఆజాద్ ను విమర్శించారు వీహెచ్. ఐఐటీలో రిజర్వేషన్లు పెట్టాలని పోరాడితే కోర్టు కోట్టేసిందని.. తర్వాత మన్మోహన్ సింగ్ కు చెప్పి పెట్టిస్తే ఎంతో మంది బీసీ బిడ్డలు ఐఐటీలో చదువుతున్నారని అన్నారు. మూడు సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే అది వాళ్ల పట్టుదల అని అన్నారు. మతతత్వ పార్టీ రోజురోజుకు పుంజుకుంటే మీరు పార్టీ వీడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ అవకాశాలు చూసుకుని వాళ్లు పార్టీని వీడుతున్నారని.. నీవు ఎందుకు వాళ్లను ఆపలేదని ఆజాద్ ను ప్రశ్నించారు. గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ కు ముఖ్యమంత్రిని చేసిందని.. అలాంటి వ్యక్తి పార్టీని వీడి వెళ్తుంటే కార్యకర్తలకు బాధ కలుగుతుందని.. ఏఐసీసీ ఎన్నికలు పెడితే గాంధీ కుటుంబం నుంచే ఎన్నకోవాలని అన్నారు.
