NTV Telugu Site icon

Uttam Kumar vs Harish Rao: బోరు బావి వద్ద మీటర్ల పై ఉత్తమ్‌ వర్సెస్‌ హరీష్ రావు

Uttam Kumar

Uttam Kumar

Uttam Kumar vs Harish Rao: శాసనసభలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ మాటల యుద్ధం మొదలైంది. విరామం అనంతరం మొదలైన శాసనసభలో బోరుబావి వద్ద మీటర్ల పై ఉత్తమ్‌ వర్సెస్‌ హరీష్ రావుగా సభ కొనసాగింది. మీటర్లు పెట్టండి అని ఉన్నట్టు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలన్నారు. మెలిక పెట్టె కేంద్ర ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. అందుకే బిల్లు వసూలు చేస్తారు అని చెప్తున్నా అన్నారు. దీంతో నీటిపారుదల, పౌరసరఫరాలు శాఖామంత్రి ఉత్తమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మీటర్లు పెట్టి రైతుల నుండి బిల్లు వసూలు చేయండి అని నిబంధనలు లేవని క్లారిటీ ఇచ్చారు. హరీష్ అబద్ధం చెప్తున్నారని మండిపడ్డారు. రైతుల నుండి బిల్లు వసూలు నిబంధనలు అపద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా నేను చెబుతున్నా అని స్పష్టం చేశారు. ఇక.. శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది.. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు.. ఈ నివేదికను ఓ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారితో తయారు చేయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ మండిపడ్డారు.

Read also: Corona : 24 గంటల్లో కేరళలో 292 మంది రోగులు.. ముగ్గురి మృతి

సీఎం గురువు దగ్గర పనిచేసిన మాదీ అధికారులతో ఈ నివేదిక వండివార్చినట్లు ఆధారాలున్నాయి.. నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదు.. అప్పులు పెరిగాయంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇచ్చిన శ్వేత పత్రలెక్కల్లో తప్పు ఉంటే చెప్పండని కోరారు. కానీ.. ఎవరి పేరులో చెప్పి తప్పుదారి పట్టించొద్దని అన్నారు. రికార్డు నుండి తొలగించాలని కోరారు. దీంతో హరీష్ రావు మాట్లాడుతూ.. వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు కొలిచే విధానం ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారని అన్నారు. తెలంగాణ కంటే 22 రాష్ట్రాల్లో అప్పు ఎక్కువ తీసుకున్నాయన్నారు. రాజస్థాన్.. 5.37 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. కర్ణాటక కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆస్తుల కల్పన చేశామన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా శ్వేత పత్రం ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో అధ్భుత ప్రగతి సాధించామన్నారు.
Harish Rao: శ్వేత పత్రం కక్ష సాధింపు లెక్క.. అది తప్పుల తడక