Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు ఖర్చు అవుతుందని, 4.47 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుతుందని హరీష్ రావు చేసిన ప్రకటన అసత్యమని ఆయన స్పష్టం చేశారు. “తుమ్మడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణాహిత బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు సిద్ధం చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో హరీష్ రావు అంచనాలు ఎలా చెబుతారు? ఇది ఆయన అతితెలివి తేటలకు అద్దం పడుతున్నట్లే” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Visakhapatnam : విశాఖపట్నం జైలు రోడ్‌లో నైట్ ఫుడ్ కోర్ట్ షాపుల తొలగింపుపై ఉద్రిక్తత
హరీష్ రావు చేస్తున్న 35 వేల కోట్ల వ్యయం, 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రకటనలు అవాస్తవమని, ఇవి పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతోనే చేస్తున్నారని ఆరోపించారు. “ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తుంది. కానీ హరీష్ రావు లాంటి నేతలు అసత్య ప్రచారం చేయడం తగదు. తెలంగాణ సమాజం ఇలాంటి వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని మంత్రి హెచ్చరించారు. తన ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని, ముఖ్యంగా రైతు సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సాగునీరు, త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు.
YS Jagan: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దాం..
