Site icon NTV Telugu

Uttam Kumar Reddy : ఓయూ కేసీఆర్‌ నా జాగీరు అనుకుంటున్నారు

జగ్గారెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. అరెస్టైన వారిని పరామర్శించడానికి పోతే.. అరెస్టులు చేస్తారా అంటూ.. కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ టీపీసీసీ ప్రెసిడెండ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ కి రాహుల్ గాంధీ తప్పకుండా వెళ్తారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో విద్యార్ధుల పాత్ర కీలకమని, ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్‌ నా జాగీరు అనుకుంటున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

నిజాం కట్టిన యూనివర్సిటీ అది అని, ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ వేసిన కమిటీ లక్ష 92 వేల ఖాళీలు అని చెప్పిందని, వాటికి ఎందుకు నోటిఫికేషన్ వేయలేదని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ 7 తేదీన న ఓయూకి వెళ్తారన్నారు. ఓ సామాన్య ఎంపీగా.. సామాన్యుడిగా వెళ్తారని ఆయన తెలిపారు.

Exit mobile version