Site icon NTV Telugu

Uttam Kumar Reddy : జరిగింది జరిగి పోయింది.. ఇక అందరం కలిసి పని చేస్తాం

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాలో ఉన్న విబేధాలపై రాహుల్ గాంధీతో చర్చ జరిగిందని, జరిగింది జరిగి పోయింది. ఇక అందరం కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్, ఎంఐఎం లతో సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు, రాహుల్ టికెట్లు అనౌన్స్ చేస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కలిసి రాహుల్ గాంధీని కలిశామని, రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు సుదీర్ఘంగా చర్చించామన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడాలని రాహుల్ గాంధీ సూచించారని, మతం ముసుగులో రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీని తెలంగాణ పొలిమేరలో రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో తెలంగాణ సమాజంలో విభజిస్తున్నాయని, బీజేపీ, టీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా ప్రతి గ్రామానికి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారని ఆయన పేర్కొన్నారు. నాయకుల మధ్య లో ఉన్న చిన్న చిన్న అభిప్రాయాలను పక్కన పెట్టాలని రాహుల్ గాంధీ తెలిపారని, అన్ని సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దామన్నారు.

Exit mobile version